కరుణ సమాధి స్థలంపై వివాదం


Wed,August 8, 2018 12:31 PM

Emotional Scenes Outside Hospital as Karunanidhi Passes Away at 94

-మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేమన్నతమిళ సర్కార్.. డీఎంకే న్యాయపోరాటం
-అర్ధరాత్రి విచారణ చేపట్టిన హైకోర్టు
-నేటి ఉదయంలోగా ప్రభుత్వానికి గడువు

చెన్నై, ఆగస్టు 7: డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహాన్ని సమాధి చేసే స్థలం విషయంలో వివాదం తలెత్తింది. మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న ప్రతిపక్ష డీఎంకే విజ్ఞప్తిని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో డీఎంకే అర్ధరాత్రి మద్రాసు హైకోర్టు తలుపుతట్టింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జీ రమేశ్ మంగళవారం అర్ధరాత్రి అత్యవసరంగా విచారణ చేపట్టారు. తమ నిర్ణయంపై సమీక్షకు కొంత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయ మూర్తి విచారణను బుధవారం ఉదయం 8గంటలకు వాయిదా వేశారు. అన్నాదురైతో కరుణానిధికి ఉన్న సుదీర్ఘ సాహచర్యం నేపథ్యంలో మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్ వద్ద స్థలాన్ని కేటాయించాలని డీఎంకే కోరుతున్నది. ఇదే విషయమై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎం పళనిస్వామికి లేఖరాశారు. న్యాయపరమైన ప్రతిబంధకాల వల్ల అక్కడ భూమి కేటాయించడం సాధ్యంకాదని ప్రభుత్వం తెలిపింది. సీ రాజగోపాలాచారి, కే కామరాజ్ స్మారక సమాధుల సమీపంలో రెండెకరాల భూమి కేటాయిస్తామని పేర్కొన్నది. ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఎంకే తరఫు న్యాయవాదులు పీ విల్సన్, శరవణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

1406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles