కాంగ్రెస్ ఓటమి ఖాయం


Thu,May 16, 2019 02:06 AM

Elections 2019 PM Modi To Address Rallies in Bengal Bihar Rahul Gandhi In Punjab

- రాజకుటుంబం వల్లే ఓడామని చెప్పే ధైర్యం ఆ పార్టీకి లేదు
- ఆ భారాన్ని మోసేందుకు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను మోహరించారు
- ఐదో విడుత ఎన్నికలు ముగిసిన తర్వాతే వారు సొంతగా బ్యాటింగ్ చేస్తున్నారు
- జార్ఖండ్, బీహార్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ


దేవ్‌గఢ్ (జార్ఖండ్)/పాలీగంజ్ (బీహార్): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఈ ఓటమి నుంచి రాజకుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను మోహరించిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించే పనిని వారిద్దరికి అప్పగించిందని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడాపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వీరిద్దరిలో ఒకరు (శామ్ పిట్రోడా) 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. జరిగిందేదో జరిగింది.. అయితే ఏంటి అంటున్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా నన్ను దూషించి తెరవెనుకకు వెళ్లిన మరొకరు (మణిశంకర్ అయ్యర్) ఇప్పుడు నాపై మళ్లీ విమర్శలు చేస్తున్నారు అని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బుధవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌తోపాటు బీహార్‌లోని పాలీగంజ్‌లో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఈ నెల 23న (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) జరిగేదేమిటో తెలుసుకునేందుకు ఈ సభలకు వచ్చిన భారీ జనసందోహమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. 23న జరిగేదేమిటో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని, అందుకే ఫలితాలను సమర్ధించుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నదని అన్నారు. రాజకుటుంబం వల్లే ఓడిపోయామని చెప్పగలిగే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. లోక్‌సభ ఐదో విడుత ఎన్నికలు ముగిశాకే రాజకుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వందిమాగధులు సొంతగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు.

కెప్టెన్‌ను అడగకుండా బరిలోకి దిగి ఆడే ధైర్యం వారికి లేదు అని మోదీ ఎద్దేవా చేశారు. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిందని, దీని వల్ల ఉగ్రవాదులు, నక్సలైట్లు, వారి మద్దతుదారులకు బలం చేకూరుతుందని, అలా జరుగనివ్వబోమని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులపై మా ప్రభుత్వం వారి స్థావరాల్లోనే దాడి చేసింది అన్నారు. 55 ఏండ్ల పాలనలో ఒక కుటుంబం చేయలేని పనులను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 55 నెలల్లో చేసింది. ఇప్పుడు దేశంలో ఎటు చూసి నా అభివృద్ధి కనిపిస్తున్నది. మా ప్రభుత్వంపై కనీసం ఒక్క మచ్చా లేదు. నిజాయితీతో కూడి న ప్రభుత్వానికి సారథ్యం వహించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారని ఈ పుణ్యక్షేత్రం (దేవ్‌గఢ్) నుంచి ఎలుగెత్తి చెప్పేందుకు నేను ఎంతో గర్విస్తున్నా అని మోదీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటుతోపాటు కేంద్రంలో గిరిజన మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని వాజపేయిని మోదీ గుర్తుచేసుకున్నా రు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంలో తనకు స్ఫూర్తి వాజపేయేనన్నారు.

విజయంపై ధీమా

లోక్‌సభ తుది విడుత ఎన్నికలకు మరో ఐదు రోజుల గడువు ఉన్నా కేంద్రంలో వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించగలనన్న విశ్వాసం మోదీలో స్పష్టంగా కనిపిస్తున్నది. వచ్చే ఐదేండ్లలో బీహార్‌కు స్వచ్ఛమైన గంగను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఉగ్రదాడుల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయినా జాతీయ భద్రత సమస్యను చిన్నదిగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. బీహార్‌లో నేను నిర్వహించే చివరి సభ ఇదే. నా పైన, వేదికపై కూర్చున్న మా మిత్రులపైన మీరు ఎంతో ప్రేమ కురిపించా రు. ఎన్నికల ఫలితం సానుకూలంగా ఉంటుందన్న భరోసా నాకు కలిగింది. మీ ప్రేమాభిమానాలను కొనసాగించి మలి విడుత ఎన్నికల్లో ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుతునా అని పాటలీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన సభలో మోదీ పేర్కొన్నారు.

206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles