బీజేపీ ఎంపీకి ఈసీ షోకాజ్ నోటీసులు

Wed,January 11, 2017 01:52 AM

MAHARAJ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కు ఎన్నికల సంఘం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరున ఉన్నావ్‌లోని ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక వర్గానికి సంబంధించి విద్వేషకర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఆయనకు నోటీసులు పంపింది. దేశంలో జనాభా పెరుగుదలకు ముస్లింలే కారణమని అన్నారు. దేశ జనాభా పెరిగినట్లే సమస్యలూ పెరుగుతున్నాయి. దీనికి హిందువులు బాధ్యులు కాదు. నలుగురు భార్యలు, నలభై మంది పిల్లల గురించి మాట్లాడేవారే దీనికి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆయన సొంత పార్టీ వారే ఈ వ్యాఖ్యలను ఖండించారు. నియమావళి, సుప్రీం కోర్టు ఆజ్ఞలను సాక్షి మహరాజ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

285

More News

మరిన్ని వార్తలు...