చౌతాలా ఆస్తులు ఈడీ జప్తు


Tue,April 16, 2019 01:01 AM

ED Attaches Assets Worth Rs 368 Crore of Om Prakash Chautala in Money Laundering Case

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన రూ.3.68 కోట్ల విలువైన నాలుగు ఆస్తులను హవాలా లావాదేవీల కేసులో జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. ఢిల్లీ, పంచ్‌కుల, సిర్సాల్లోని స్థిరాస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద జప్తు చేశామని సోమవారం ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అక్రమాస్తుల ఆరోపణల్లో చౌతాలాపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ హవాలా లావాదేవీల కేసు ను రిజిస్టర్ చేసింది. గుర్తు తెలియని వనరుల ద్వారా వచ్చిన ఆదాయంతో ఢిల్లీ, పంచ్‌కులలో స్థిరాస్తులు సంపాదించారని, సిర్సాలో భవన నిర్మాణం చేపట్టారని ఈడీ తెలిపింది.

86
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles