ఈబీసీ బిల్లును కొట్టివేయండి


Fri,January 11, 2019 12:48 AM

Ease the EBC bill

-సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
-50% గరిష్ఠ పరిమితిని బిల్లు ఉల్లంఘిస్తున్నదని ఆరోపణ
న్యూఢిల్లీ, జనవరి 10: అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు-2019కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ఠ పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాజా బిల్లు ఉల్లంఘిస్తున్నదని పేర్కొంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన ఈ బిల్లును కొట్టివేయాలని ఆ సంస్థ కోరింది. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన మరుసటి రోజే ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. 1992లో ఇందిరా సహానీ కేసులో 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ... రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక ప్రాతిపదిక ఒక్కటే సరిపోదన్న రాజ్యాంగ నిబంధనను తాజా బిల్లు ఉల్లంఘిస్తున్నదని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.

322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles