ఉత్తర భారతంలో భూప్రకంపనలుThu,December 7, 2017 02:22 AM

రుద్రప్రయాగ్‌లో భూకంప కేంద్రం.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు
rudraprayag
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ్, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)తోపాటు ఉత్తర భారతంలో పలు చోట్ల బుధవారం భూమి కంపించింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. బుధవారం రాత్రి 8.49 గంటలకు భూమి కంపించిందని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం రుద్రప్రయాగ్ జిల్లాలో 30 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉన్నదని, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో డెహ్రడూన్‌లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని కొంత భాగంలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

330

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018