పలు రాష్ర్టాల్లో భూకంపం


Thu,September 13, 2018 12:31 AM

Earthquake in several states

-అసోం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ర్టాల్లో ప్రకంపనలు; ఒకరు మృతి
కోల్‌కతా: అసోం, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రదేశాల్లో కూడా భూమి కంపించింది. అసోం, మేఘాలయల్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టు భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 10.20 గంటలకు 15 నుంచి 20 సెకండ్లపాటు భూమి కంపించిందని, అసోంలోని కోక్రజార్‌కు వాయవ్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో కూడా భూమి కంపించింది. సిలిగురిలోని ఓ కాంప్లెక్స్ కంపించడంతో మెట్లు దిగుతున్న 22 ఏండ్ల యువకుడు జారిపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బీహార్‌లో, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles