నిర్భయ్ పరీక్ష విజయవంతం


Tue,April 16, 2019 01:30 AM

DRDO successfully test fires sub sonic cruise missile Nirbhay

బాలాసోర్, ఏప్రిల్ 15: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ పరీక్ష విజయవంతమైంది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి సోమవారం ఉదయం 11.44 గంటలకు బహుళ వేదికల నుంచి నిర్భయ్‌ని పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. 100 మీటర్ల ఎత్తున ఉన్న క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని 42:23 నిమిషాల్లో నిర్భయ్ చేధించినట్లు పేర్కొంది. క్షిపణి ప్రయోగాన్ని రాడార్ల ద్వారా గమనించామని తెలిపింది. ఇంతకుముందు నిర్భయ్ క్షిపణిని 2017 నవంబర్ ఏడో తేదీన పరీక్షించామని డీఆర్డీవో వివరించింది.

93
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles