ఎంపీఏటీజీఎం విజయవంతం


Thu,September 12, 2019 02:30 AM

DRDO successfully test fires indigenous anti tank missile for Army

న్యూఢిల్లీ: యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయగల సామర్థ్యం ఉన్న క్షిపణి (మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ -ఎంపీఏటీజీఎం)ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని సైన్యం బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని మ్యాన్ పోర్టబుల్ ట్రైపొడ్ లాంఛర్ నుంచి ప్రయోగించిందని, ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నదని డీఆర్‌డీవో తెలిపింది. తక్కువ బరువుతో అభివృద్ధి చేసిన ఎంపీఏటీజీఎం క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం భారత సైన్యానికి, డీఆర్‌డీవోకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ క్షిపణిని సైన్యం విజయవంతంగా ప్రయోగించడం ఇది మూడోసారి. ఎంపీఏటీజీఎం క్షిపణి ప్రయోగం విజయవంతమైనందుకు డీఆర్‌డీవో సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. మూడోతరం ఎంపీఏటీజీఎం క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమం చేసిందన్నారు.

118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles