కశ్మీరీ ఉత్పత్తులను బహిష్కరించండి


Wed,February 20, 2019 01:16 AM

Dont Go to Amarnath Boycott Everything Kashmiri Meghalaya Governor Encourages Discrimination

-అమర్‌నాథ్ యాత్రకు కూడా వెళ్లొద్దు
-మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

షిల్లాంగ్, ఫిబ్రవరి 19: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మేఘాలయ గవర్నర్ తథాగథ రాయ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వచ్చే రెండేండ్ల పాటు కశ్మీరీ ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమర్‌నాథ్ యాత్ర కోసం కూడా కశ్మీర్‌కు వెళ్లొద్దని మంగళవారం ట్వీట్ చేశారు. వచ్చే రెండేండ్ల పాటు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లొద్దు. కశ్మీర్‌ను సందర్శించొద్దు. ప్రతి శీతాకాలంలో కశ్మీరీ వ్యాపారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయించే స్వెట్టర్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేయొద్దు. ప్రతి కశ్మీరీ వస్తువును బహిష్కరించండి. భారత ఆర్మీ రిటైర్డ్ కల్నల్ అభ్యర్థన ఇది. దీనికి నేను అంగీకరిస్తాను అని పేర్కొన్నారు. తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో పాక్ సైన్యం ప్రజల ఊచకోతకు పాల్పడింది. అకృత్యాలు, అత్యాచారాల వంటి యుద్ధ నేరాలకు పాల్పడింది. ప్రస్తుతం కశ్మీరీ వేర్పాటువాదులను వెనుక నుంచి పాక్ సైన్యం నడిపిస్తున్నది. కానీ మన సైన్యం అలా ఊచకోతకు పాల్పడాలని నేను చెప్పడం లేదు. కానీ కొంతదూరం వెళ్లొచ్చు అని వ్యాఖ్యానించారు.

285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles