రాజకీయ హింసపై నివేదిక పంపండి


Sun,June 16, 2019 02:38 AM

Doctors strike What Mamata said in press conference not true, agitating doctors claim

- బెంగాల్ సర్కార్‌కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె.. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ హింసపైనా వేర్వేరు నివేదికలు పంపాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీచేసింది. దవాఖానల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. గత నాలుగేండ్లలో కొనసాగిన రాజకీయ హింసతో 160 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ హింసతో పశ్చిమబెంగాల్‌లోని అధికార యంత్రాంగం, పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని కేంద్రం పేర్కొంది. ఏండ్ల తరబడి సాగుతున్న రాజకీయ హింస తీవ్ర ఆందోళనకరం అని పేర్కొంది. 2016-19 మధ్య ఎన్నికల సంబంధ రాజకీయ హింస పెరిగిందని గుర్తు చేసింది. 2019లో ఇప్పటివరకు 773 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది.

ముగ్గురు టీఎంసీ కార్యకర్తల హతం

ముర్షీదాబాద్ జిల్లాలో శనివారం ముగ్గురు తృణమూల్ కార్యకర్తలు హత్యకు గుర య్యారు. అందరూ ఒకే కుటుంబానికి చెం దినవారని పోలీసులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ముందు వీరి బంధువు అల్తాఫ్ హుస్సేన్ కూడా హత్యకు గురయ్యారు.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles