డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు

Thu,February 21, 2019 01:18 AM

-తమిళనాడులో 9, పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ
చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వస్తున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తయిన మరుసటి రోజే డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కూడా ఓ ఒప్పందానికి వచ్చాయి. తమిళనాడులో 9 సీట్లతోపాటు పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బుధవారం మీడియా సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ... డీఎంకే పోటీ చేయబోయే స్థానాలు ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీలతో డీఎంకే చర్చలు జరుపుతున్నది. కనీసం 25 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే భావిస్తున్నది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయాయి. అయితే ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము పోటీచేయబోయే తొమ్మిది స్థానాలను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు.

389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles