వాళ్లను గుర్తుంచుకోవడానికే.. గడ్డం తీయట్లేదు

Thu,December 5, 2019 01:05 AM

బెంగళూరు: తనను తీహార్ జైలుకు పంపిన వారిని గుర్తుంచుకోవడానికే గడ్డం తీయడం లేదని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సీనియర్ నేత డీకే శివకుమార్ చెప్పారు. ఇటీవల మనీ లాండరింగ్ కేసు లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన శివకుమార్ అప్ప టి నుంచి గడ్డంతోనే కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న శివకుమార్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నా స్నేహితులను మరిచిపోకుండా ఉండటానికే గడ్డం పెంచుతున్నానన్నారు. కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప తనపై మరో కేసు నమోదు చేసేందుకు సీబీఐకి అనుమతినిచ్చారని శివకుమార్ చెప్పారు. గురువారం రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత ఏ క్షణంలోనైనా ఏదైనా జరుగ వచ్చునన్నారు. తన వల్ల బీజేపీకి ముప్పని భావిస్తున్నందునే తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని చెప్పారు.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles