కోవింద్ విజయం కోసం స్వగ్రామంలో పూజలు

Tue,July 18, 2017 01:20 AM

kovind-village
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్ విజయం ఖాయమని ఓవైపు పరిశీలకులు పేర్కొంటుండగా, ఆయన స్వగ్రామానికి చెందిన వారు మాత్రం ఇంకా అనుమానంగానే ఉన్నారు. కోవింద్ స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని పరౌఖ్‌లో మూడు రోజులుగా ఆలయ గంటలు మోగుతూనే ఉన్నాయి. అఖండ రామాయణ పఠనం కొనసాగుతూనే ఉన్నది. ఇది ఈ నెల 25వరకూ అనగా భారత 14వ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ఆలయంలో పూజలు, రామాయణ పఠనం కొనసాగనున్నది. కోవింద్ విజయం ఖాయమని అధికార పక్షం ఢంకా బజాయిస్తున్నది. అయినా సరే తమ భూమి పుత్రుని విజయం కోసం ఈ పూజలు కొనసాగుతాయని గ్రామస్తులంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం, కోవింద్ తన 26 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసిన రెండుసార్లూ ఓడిపోవడమేనని వారు చెప్తున్నారు. అందుకే ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా కోవింద్‌కు విజయం చేకూర్చాలని తమ గ్రామ దేవత పట్టారీ దేవిని వేడుకుంటున్నామని ఆలయ ప్రాంగణంలో రామాయణాన్ని పఠిస్తున్న ఓ యువకుడు చెప్పాడు. ఆలయానికి 50 అడుగుల దూరంలోనే ఓ మసీదు ఉంది. గత నాలుగైదు రోజులుగా హిందువులు, దళితులు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు.

101

More News