10 రోజులు.. కోటి డౌన్‌లోడ్స్Tue,January 10, 2017 01:59 AM

BHIM-e-wallet-app
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన భీమ్ యాప్ (భారత్ ఇంటర్‌ఫేజ్ ఫర్ మొబైల్) రికార్డులు సృష్టిస్తున్నది. యాప్ ప్రారంభించిన కేవలం పదిరోజుల్లోనే గూగుల్ ప్లేస్టోర్ నుంచి కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ఈ యాప్‌ను గత డిసెంబర్ 30న మోదీ ప్రారంభించారు. యాప్‌ను కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారనే వార్త విని ఎంతో ఆనందించాను. మేకిన్ ఇండియా శక్తికి ఇదొక నిదర్శనం. అదేవిధంగా అవినీతిని, నల్లధనాన్ని రూపుమాపేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చో నిరూపిస్తున్నది అని ప్రధాని మోదీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాప్ విడుదల చేసిన మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా గూగుల్ ప్లేస్టోర్‌లో 4.1 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు, ఫీచర్‌ఫోన్లలోనూ ఈ యాప్ ద్వారా ఈ-పేమెంట్స్ జరిపే వెసులుబాటు ఉన్నది. రిజిష్ర్టేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా పేమెంట్స్ జరిపే అవకాశం ఉన్నది.

513
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS