ఫైర్‌బ్రాండ్ డీఐజీ రూప బదిలీTue,July 18, 2017 01:17 AM

Roopa
జైలులో శశికళకు వీఐపీ సౌకర్యాలపై నివేదిక ఇవ్వడంతో చర్యలు
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ నుంచి రూ.2 కోట్లు తీసుకొని పరప్పన కేంద్రకారాగారంలో ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని నివేదిక సమర్పించిన జైళ్లశాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) రూపను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బదిలీచేసింది. జైళ్లశాఖ డీఐజీ నుంచి రోడ్డుభద్రత, ట్రాఫిక్ కమిషనర్‌గా నియమించింది. రూప ఆరోపణలు చేసిన జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్ సత్యనారాయణరావుకు కూడా స్థానచలనం కలిగింది. ఆయన స్థానంలో అవినీతి నిరోధకశాఖ ఏడీజీపీ ఎన్‌ఎస్ మేఘరిఖ్‌ను జైళ్లశాఖ డీజీపీగా నియమిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది. అందులో రూప స్థానంలో కొత్తగా నియమించే అధికారి పేరును మాత్రం తెలుపలేదు. రూప బదిలీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. సర్వీసు నిబంధనలను రూప ఉల్లంఘించారని అన్నారు. ఆమెను ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించారు. పరిపాలన ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ విభాగానికి బదిలీచేసినట్లు తెలిపారు.

368

More News

VIRAL NEWS