జర్నలిస్టు హత్య కేసులో డేరా అధిపతి గుర్మీత్ దోషి


Sat,January 12, 2019 02:03 AM

Dera chief Gurmeet Ram Rahim 3 others convicted in journalist murder case

-మరో ముగ్గురు కూడా..
-ఈ నెల 17న శిక్షలు ఖరారు చేయనున్న సీబీఐ న్యాయస్థానం

పంచకుల, జనవరి 11: ఓ జర్నలిస్టు హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాంరహీమ్ సింగ్, మరో ముగ్గురిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి శిక్షలను ఈ నెల 17న ప్రకటించనుంది. హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ప్రాంగణంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొంటూ అందులో ఉన్న ఓ మహిళ రాసిన లేఖను పూరా సచ్ అనే సాయంకాల పత్రిక జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతి 2002లో ప్రచురించారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది రాంచందర్ ఛత్రపతిని ఆయన ఇంటి బయట కొందరు కాల్చి చంపారు. దీనిపై గుర్మీత్‌తోపాటు మరో ముగ్గురిపై 2003లో కేసు నమోదైంది. అనంతరం 2006లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీనిలో భాగంగా శుక్రవారం విచారణ జరిపిన సీబీఐ కోర్టు గుర్మీత్‌పాటు మరో ముగ్గురిని దోషులుగా ప్రకటించింది. ఇద్దరు మహిళలపై లైంగికదాడి కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ శుక్రవారం విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. దోషులుగా తేలిన వారిలో కుల్‌దీప్ సింగ్, నిర్మల్ సింగ్, క్రిషన్‌లాల్ ఉన్నారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles