కాలుష్య దుప్పటిలో ఢిల్లీ!


Fri,November 9, 2018 01:34 AM

Delhis Air Quality Is Worst Of Year After Supreme Court Order Defied On Diwali

న్యూఢిల్లీ, నవంబర్ 8: దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఈ ఏడాదిలోనే అత్యధిక కాలుష్యం గురువారం ఉదయం నమోదైంది. వాయు కాలుష్య తీవ్రత 574 పాయింట్లకు చేరుకుంది. ఈ తీవ్రత సాధారణ కాలుష్యం కన్నా పదిరెట్లు ఎక్కువ. దీంతో వాతావరణం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దట్టమైన వాయుకాలుష్య దుప్పటిని కప్పినట్లు ఉన్నది. పండుగ రోజు కేవలం రెండు గంటలు మాత్రమే పటాకులను కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడంతోనే వాయు కాలుష్యం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించినందుకు 550కిపైగా కేసులు నమోదు చేసి 300లకుపైగా మందిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. పండుగ సందర్భంగా పటాకులు కాల్చడం లాంటి ఘటనల వల్ల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles