కార్తి చిదంబరం సీఏకు బెయిల్


Wed,March 14, 2018 12:13 AM

Delhi Court Grants Bail To Karti Chidambaram Chartered Accountant In INX Media Case

న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా నల్లధనం కేసులో అరెస్ట్ అయిన కార్తి చిదంబరం చార్టెడ్ అకౌంటెంట్ ఎస్ భాస్కర రామన్‌కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడైన కార్తితోపాటు ఆయనకు సీఏగా వ్యవహరించిన భాస్కర రామన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెల 16న అరెస్ట్ చేసింది. నల్లధనం కేసులో కార్తికి సహకరించారన్న ఆరోపణ తప్ప రామన్‌పై ఇతరత్రా అభియోగాలు లేవు కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.

226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles