శివకుమార్ కస్టడీ 17 వరకు పొడిగింపు


Sat,September 14, 2019 02:05 AM

Delhi Court Extends Karnataka Congress Leader DK Shivakumars ED Custody till September 17

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కౌహార్ శుక్రవారం ఆదేశించారు. సెప్టెంబర్ 3న మనీ ల్యాండరింగ్ కేసులో శివకుమార్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం విచారణగడువు ముగియడంతో ఢిల్లీలోని కోర్టులో శివకుమార్‌ను హాజరుపరిచారు. విచారణ సమయంలో శివకుమార్ పొంతనలేని సమాధానాలు చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. అతడి వద్ద రూ. 200 కోట్ల నల్లడబ్బు, రూ. 800 కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. శివకుమార్ తనకు తెలిసిన విషయాలను కూడా చెప్పడం లేదని ఈడీ తెలిపింది. ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా శివకుమార్‌ను ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాలని కోరింది. కేసు తీవ్రతదృష్ట్యా కోర్టు కస్టడీని మరో ఐదురోజులు పొడిగించింది.

96
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles