మొరాయించిన ఈవీఎంలు


Wed,April 24, 2019 02:49 AM

Delhi CM Arvind Kejriwal Tweets About EVM Tampering In Goa

-విపక్ష నేతల తీవ్ర విమర్శలు
-ఎవరికి ఓటువేసినా బీజేపీకే వెళ్తున్నది: అఖిలేశ్
-మోసపూరిత ఓట్లు: కేజ్రీవాల్
-నేను కూడా వేచిచూడాల్సి వచ్చింది: పినరయి విజయన్

లక్నో/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మూడో విడుత లోక్‌సభ ఎన్నికల్లో పలు చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించాయి. ఉత్తరప్రదేశ్, గోవా, కేరళ, బీహార్ రాష్ర్టాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ఈవీఎంల వైఫల్యంపై విపక్ష నేతలు మండిపడ్డారు. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, ఎవరికి ఓటు వేసినా బీజేపీకే వెళ్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. దీన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా భావించాలని పేర్కొన్నారు. మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈవీఎంలు మోరాయిస్తున్నాయి. లేదా ఎవరికి ఓటు వేసినా అది బీజేపీ అభ్యర్థికే వెళ్తున్నది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, దేశ భవిష్యత్‌కు సంబంధించిన లోక్‌సభ ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా? దీన్ని కచ్చితంగా నేరపూరిత నిర్లక్ష్యంగా భావించాలి. 350కిపైగా ఈవీఎంలను మార్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థమవుతున్నది. పోలింగ్ అధికారులకు సరైన శిక్షణ లేదని జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గోవాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడుతుండడంతో చెర్తాలా సమీపంలోని కిజక్కే నల్పత్తు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను మార్చారు అన్న వార్తా కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఇది నిజంగా షాకింగ్.. అన్ని అక్రమ ఈవీఎంలు బీజేపీకే ఓట్లను బదిలీచేస్తున్నాయి అని ట్విట్టర్‌లో ఆరోపించారు. కేరళలో, హస్తం గుర్తుపై నొక్కితే.. కమలం గుర్తుపై లైట్ వెలుగుతున్నది. అన్ని లోపభూయిష్టమైన ఈవీఎంలు కేవలం బీజేపీనే ఎలా ఎంపిక చేసుకుంటున్నాయి అని ట్విట్టర్‌లో ఓ ఓటరు చేసిన పోస్టును కేజ్రీవాల్ షేర్ చేశారు. మోసపూరితంగా బీజేపీకే ఓట్లు వెళ్తున్న మరో ఈవీఎం అంటూ ఆ పోస్టుపై వ్యాఖ్యానించారు. మరోవైపు ఈవీఎంల వైఫల్యంపై కేరళ సీఎం పినరయి విజయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో స్వయంగా నేను కొంతసేపు వేచిచూడాల్సి వచ్చింది. ఈవీఎంలు పనిచేయడం లేదని నాకు ఫిర్యాదులు అందాయి. ఇతర ప్రాంతాల్లోనే ఇదే పరిస్థితి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే వెళ్తున్నదని ఆరోపణలు రావడంతో తిరువనంతపురంలోని కోవళం బూత్‌కు కలెక్టర్ హుటాహుటిన వచ్చారు. ఈవీఎంలు పరిశీలించిన అనంతరం, ఆ ఆరోపణలు అవాస్తవమని కలెక్టర్ తెలిపారు.

ఈవీఎంలను రష్యన్లు హ్యాక్ చేయొచ్చు

ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, వాటిని దుర్వినియోగపర్చుతూ బీజేపీ ఓట్లను దండుకుంటున్నదని పేర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా మరో కొత్త ఆరోపణ చేశారు. రష్యాకు చెందిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశముందని చెప్పారు. ఈవీఎంలను రిమోట్ కంట్రోల్ ద్వారా హ్యాక్ చేయవచ్చు. ఇందులో రష్యాకు చెందిన వ్యక్తులు చాలా క్రియాశీలకంగా ఉన్నారు. వాళ్లు ఈవీఎంలను కంట్రోల్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి అని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల్లో 18 దేశాలు మాత్రమే ఎన్నికల కోసం ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ స్పందిస్తూ కేంద్రంలోని మోదీప్రభుత్వాన్ని ఓడించాలన్న ధృడసంకల్పంతో ప్రజలు ఉన్నారని, కానీ ఈవీఎంల దుర్వినియోగం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు.

316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles