తొలి రోజే వివాదంలో సీఈసీWed,January 24, 2018 01:16 AM

-ఆప్ ఎమ్మెల్యేలు విచారణ కోరలేదన్న రావత్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తొలి రోజే వివాదంలో చిక్కుకున్నారు. ఈ అంశంపై తమ వాదన వినిపిస్తామని ఆప్ ఎమ్మెల్యేలు ఏనాడు కోరలేదని మంగళవారం మీడియాతో చెప్పారు. ఆప్ నేతలకు రెండుసార్లు నోటీ సులు జారీ చేసినా, వారు స్పందించలేదని అన్నారు. సీఈసీ రావత్ ప్రకటనపై ఆప్ నాయకుడు రాఘవ్ చద్ధా విభేదించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారన్నారు. మరోవైపు ఆప్ అనర్హత ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

134
Tags

More News

VIRAL NEWS