తీర్పుపై అభ్యంతరకర పోస్టులు

Mon,November 11, 2019 12:59 AM

- దేశవ్యాప్తంగా 90 మంది అరెస్ట్‌
- ఉత్తరప్రదేశ్‌లో అత్యధికం

లక్నో, నవంబర్‌ 10: అయోధ్యపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేసిన కొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సామాజిక సామరస్యానికి భంగం కలిగించేందుకు వీరు చేసిన ప్రయత్నాలను భగ్నం చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 90 మంది అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా రెండు రోజుల్లో 77 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,275 అభ్యంతరకర పోస్టులను గుర్తించారు. ఇందులో ఆదివారం పోస్టు చేసినవి 4,563 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి రెండు రోజుల్లో 37 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. శనివారం 12 కేసులు నమోదు చేసి 37 మందిని అరెస్ట్‌ చేశామని, ఆదివారం 22 కేసులు నమోదు చేసి 40 మందిని అరెస్ట్‌ చేసినట్లు సోషల్‌ మీడియా పర్యవేక్షక విభాగం అధికారి తెలిపారు. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర వార్తలు, పోస్టులపై నిఘా కోసం యూపీలో తొలిసారి ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ (ఈవోసీ)ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ వోపీ సింగ్‌ తెలిపారు. యరోవైపు వాట్సప్‌లో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో పది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తీర్పును స్వాగతిస్తూ పటాకులు కాల్చిన గ్వాలియర్‌ జైలు వార్డెన్‌ మహేశ్‌ అవద్‌ను సస్పెండ్‌ చేశారు.

125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles