నాన్నా! మమ్మల్ని వేటాడకండి!


Fri,July 12, 2019 02:25 AM

Daughter of BJPs Bareilly MLA Says Father Out to Kill Her After Marriage With Dalit Man

- కులాంతర వివాహం చేసుకున్న యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె విన్నపం

లక్నో, జూలై 11: కులాంతర వివాహం మరోసారి దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లా బిఠారీ చైన్‌పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా (బీజేపీ) కుమార్తె సాక్షి మిశ్రా (23), దళిత సామాజిక యువకుడ్ని పెండ్లి చేసుకోవడంతో ఆ జంటకు బెదిరింపులు ఎదురయ్యాయి. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎమ్మెల్యే కుమార్తె ఒక వీడియోను విడుదల చేసింది. నా ఇష్టపూర్వకంగానే అజితేశ్‌ను పెండ్లి చేసుకున్నాను. నా తండ్రి మా ఇద్దర్ని చంపేందుకు గుండాలను పంపారు. మేము వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాం. నా తండ్రి వల్ల మా ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉంది. మాకు పోలీసు రక్షణ కావాలి అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నాన్నా.. మమల్ని ప్రశాంతంగా బతుకనీయండి. అజితేశ్, ఆయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. మాకేమైనా జరిగితే నా తండ్రి, సోదరుడు విక్కీ, రాజీవ్ రాణా బాధ్యులు. మా ప్రాణాలకు ముప్పు ఉంది. బరేలీ ఎంపీ, ఎమ్మెల్యేలు నా విషయంలో నా తండ్రికి ఎలాంటి సహాయం చేయవద్దని నా మనవి అని సాక్షి మిశ్రా పేర్కొన్నారు. ఆమె భర్త అజితేశ్ కుమార్ కూడా ఆమె పక్కన కనిపించారు.

మేమున్న హోటల్ వద్దకు గుండా ల గుంపు వచ్చింది. మేము వారి నుంచి తృటిలో తప్పించుకున్నాం అని కుమార్ అన్నారు. తన కుమార్తె వీడియో సందేశంపై ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా గురువారం స్పందించారు. తన కుమార్తె మేజర్ అని, ఆమె ఇష్టంతో చేసుకున్న పెండ్లిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తన కుమార్తెకు, ఆమె భర్తకు మధ్య వయసులో 9 ఏండ్లపైగా వ్యత్యాసం ఉందని, అతడికి సంపాదన కూడా సరిగా లేదన్నారు. తన బిడ్డ భవిష్యత్ పై ఇవే తన ఆందోళనలని ఆయన తెలిపారు. మరోవైపు రక్షణ కల్పించాలన్న సాక్షి మిశ్రా వీడియో విన్నపంపై డీఐజీ ఆర్కే పాండే స్పందించారు. ఆ జంటకు తగిన రక్షణ కల్పించాలని సీనియర్ ఎస్పీని ఆదేశించారు. అయితే వారిద్దరూ ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా చెప్పకపోవడంతో వారికి ఎక్కడ రక్షణ కల్పించాలో అన్నది పోలీసులకు తెలియడం లేదని ఆర్కే పాండే చెప్పారు.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles