కరుణానిధికి గుడి


Mon,August 26, 2019 01:42 AM

Dalit Community to Build Temple for DMK Leader Karunanidhi

నమక్కల్ (తమిళనాడు), ఆగస్టు 25: డీఎంకే మాజీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం కరుణానిధికి ఆ రాష్ట్రం లో గుడి కడుతున్నారు. తమ కులానికి ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించినందుకు గౌరవ సూచకంగా నమక్కల్ జిల్లాలోని కుచికాడు గ్రామంలోని కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈ గుడి నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కూడా చేశారు. మా అరుంతాతియార్స్ (ఎస్సీ వర్గం) కులానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్‌ను దశాబ్దం క్రితం డీఎంకే హయాంలో కరుణానిధి కల్పించారు. ఆయన గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం అని సదరు కులస్థులు తెలిపారు. కరుణానిధి తమ కుల దైవమని వాళ్లు పేర్కొన్నారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles