రేపు తీరం దాటనున్న వాయు


Sun,June 16, 2019 02:37 AM

Cyclone Vayu May Move Towards Gujarat Again Tomorrow Says Government

- గంటకు 125 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- అప్రమత్తంగా గుజరాత్ ప్రభుత్వం


అహ్మదాబాద్, జూన్ 15: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ అల్ప పీడనంగా మారి సోమవారం సాయంత్రంలోగా మరింత బలహీన పడి ఉత్తర గుజరాత్ కోస్తా వద్ద తీరం దాటొచ్చునని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం తెలిపింది. తుఫాన్ పశ్చిమ నైరుతి పోర్‌బందర్‌కు 275 కిమీ, వెరవాల్‌కు పశ్చిమ నైరుతి దిశగా 330 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని, శనివారం ఉదయం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వాయు తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి పశ్చిమ దిశగా ప్రయాణించవచ్చునని పేర్కొంది. 17వ తేదీ సాయంత్రానికి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల మధ్య వాయు తుఫాన్ తీరం దాటుతుందని పేర్కొంది. తుఫాన్ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, సౌరాష్ట్రలో భారీ వర్షపాతం నమోదైనట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పంకజ్ కుమార్ తెలిపారు.

229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles