ఫొని నష్టం 12వేల కోట్లు


Thu,May 16, 2019 01:54 AM

Cyclone Fani Tentative Loss Estimated at Rs 12 000 Crore in Odisha

- ప్రాథమిక అంచనా నివేదికను కేంద్రానికి అందజేసిన ఒడిశా
- విపత్తు సహాయ నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి


భువనేశ్వర్, మే 15: ఫొని తుఫాన్ కారణంగా సుమారు రూ.12,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర ప్రభుత్వ బృందానికి బుధవారం ఈ నివేదికను అందజేసింది. విపత్తు సహాయ నిబంధనలు సడలించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆస్తులకు రూ.5,175 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, సహాయ కార్యక్రమాలకు రూ.6,767 కోట్లు వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొంది. ప్రాథమిక నివేదికను కేంద్ర బృందానికి అందజేశాం. నష్టం అంచనా ఇంకా పెరగొచ్చు. తుఫాన్ నష్టాన్ని అంచనావేసేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం ప్రభుత్వం సమగ్ర నివేదికను రూపొందిస్తుంది అని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ బీపీ సేథి తెలిపారు. అత్యధికంగా విద్యుత్ రంగానికి రూ.1,160 కోట్లు, పంచాయతీ రాజ్, తాగునీటి విభాగానికి రూ.587 కోట్లు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా ఇండ్లు, హోటళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి అని పేర్కొన్నారు.

148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles