గృహ ఇంధనాలే శాపం


Sat,April 20, 2019 02:23 AM

Cutting household fuel use may save 2.7 Lakh lives annually in India

-వాయు కాలుష్యానికి అవే ప్రధాన కారణం
-మన దేశంలో వాటి వినియోగానికి స్వస్తి పలికితే
- ఏటా 2.7 లక్షల మందిని కాపాడుకోవచ్చన్న అధ్యయనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వాయు కాలుష్యాన్ని భారత్ గణనీయంగా తగ్గించగలదని, కలప, పిడకలు, బొగ్గు, కిరోసిన్ లాంటి గృహ ఇంధనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఏటా దాదాపు 2.7 లక్షల మంది ప్రాణాలను కాపాడగలదని ఐఐటీ-ఢిల్లీ పరిశోధకుల సారథ్యంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పారిశ్రామిక, వాహన ఉద్గారాల్లో ఎలాంటి మార్పులు లేకుండా గృహ ఇంధన వనరుల నుంచి వెలువడే ఉద్గారాలను నిర్మూలించడం ద్వారా బహిరంగ బహిరంగ వాయు కాలుష్యాన్ని దేశ ప్రామాణిక వాయు కాలుష్యం కంటే దిగువ స్థాయికి తగ్గించుకోవచ్చని జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది. గృహ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకుంటే దేశంలో ఏటా వాయు కాలుష్యం వల్ల మరణించేవారిలో దాదాపు 13 శాతం (సుమారు 2,70,000) మందిని కాపాడుకోవచ్చని ఐఐటీ-ఢిల్లీకి చెందిన సాంగిక్ డే, ఇతర పరిశోధకులు స్పష్టం చేశారు.

భారత్‌లో ఔట్ డోర్ వాయు కాలుష్యానికి గృహ ఇంధనాలే అతిపెద్ద కారణం. భారత్‌లో కలప, బొగ్గు లాంటి గృహ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలికితే ఏమి జరుగుతుందన్న విషయంపై మేము దృష్టి సారించాం. ఆ పని గనుక చేయగలిగితే దేశంలో బహిరంగ వాయు కాలుష్యం జాతీయ ప్రామాణిక వాయు కాలుష్య స్థాయికి తగ్గుతుందని మా అధ్యయనంలో తేలింది అని బర్కిలీ (అమెరికా)లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కిర్క్ ఆర్ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో విద్యుత్, గ్యాస్ కొరత ఉన్న చాలా గ్రామీణ ప్రాంతాల్లో వంటచెరకుగా జీవవ్యర్థాలు, కలప, పిడకలు, కిరోసిన్ లాంటి ఇంధనాలను మండిస్తుండటంతో భారీగా వాయు కాలుష్యం వెలువడుతున్నది. 2016 ఆరంభం నాటికి మన దేశ జనాభాలో దాదాపు సగం మంది వంట కోసం ఇటువంటి ఇంధనాలపైనే ఆధారపడినట్టు పరిశోధకులు తెలిపారు.

259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles