పరిమళించిన మానవత్వం

Wed,May 15, 2019 01:32 AM

- తన ఆహారాన్ని దివ్యాంగ బాలుడికి తినిపించిన సీఆర్పీఎఫ్ జవాన్


శ్రీనగర్/న్యూఢిల్లీ: దేశానికి రక్షణ కల్పించడంలోనే కాదు.. మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ముందున్నామని నిరూపించాడు సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ జవాన్. వికలాంగుడైన ఓ బాలుడికి తాను తినే ఆహారాన్ని తినిపించి శభాష్ అనిపించుకున్నాడు. కశ్మీర్‌లోని 49వ బెటాలియన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ఇక్బాల్ సింగ్ సోమవారం నావకాదల్ ప్రాంతంలో భోజనం చేస్తుండగా.. ఎదురుగా ఉన్న మూసివేసిన దుకాణం ముందు నల్లటి దుస్తులు ధరించిన ఓ దివ్వాంగ బాలుడు దీనంగా ఇక్బాల్ వైపు చూస్తూ కూర్చొన్నాడు.ఆ బాలుడు అన్నం కావాలని సైగల ద్వారా చెప్పడంతో ఇక్బాల్ అతడి వద్దకు వెళ్లాడు. పక్షపాతంతో చేతులు పడిపోయిన ఆ బాలుడికి తనే స్వయంగా అన్నం తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పారామిలిటరీ దళాల్లో సేవలకు ఇచ్చే డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్, సర్టిఫికెట్ అవార్డును ఇక్బాల్‌కు ఇవ్వాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది.

259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles