నిజాయితీ చాటుకున్న ఢిల్లీ ఎస్‌ఐTue,January 10, 2017 01:53 AM

Cop-returns
న్యూఢిల్లీ: మనం పోగొట్టుకున్న పర్సు.. అందులోని వస్తువులేవీ పోకుండా తిరిగి మన వద్దకే వస్తే ఆ కిక్కే వేరు. ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. ఇక్కడ నిజాముద్దీన్ దర్గా క్రాసింగ్ వద్ద జగ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి శుక్రవారం తన పర్సును పోగొట్టుకున్నాడు. రోడ్డు మీద పడిఉన్న పర్సును ఢిల్లీ ఎస్‌ఐ మదన్ సింగ్ కనుగొని అందులో విజిటింగ్ కార్డును పరిశీలించారు. అనంతరం జగ్‌ప్రీత్‌కు ఎస్‌ఐ పర్సును అందజేయడంతో ఆయన ఆశ్చర్యపోయారు. జగ్‌ప్రీత్ కారు నిజాముద్దీన్ ప్రాంతంలో మధ్యలో ఆగిపోయింది. తన కారును స్టార్ట్ చేయడానికి జగ్‌ప్రీత్ కిందకు దిగి కారును తోసే క్రమంలో పర్సు కిందపడింది. పర్సులో ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, కొంత నగదు, రూ.50,000 విలువచేసే విదేశీ ద్రవ్యం ఉన్నాయి. ఆదివారం ఎస్‌ఐ మదన్‌సింగ్ జగ్‌ప్రీత్‌కు ఫోన్ చేసి పర్సును తీసుకెళ్లాలని చెప్పారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి తన వద్దకే అందులోని వస్తువులేవీ పోకుండా రావడంతో ఆశ్చర్యపోవడం జగ్‌ప్రీత్ వంతయింది. ఎస్‌ఐ నిజాయితీకి మెచ్చుకుంటున్నా అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

999
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS