కాంగ్రెస్ లోక్‌సభ నేత ఎవరు?


Mon,June 17, 2019 02:22 AM

Congress yet to decide on leader in Lok Sabha

-మనీశ్ తివారీ, శశిథరూర్, అధిర్ రంజన్, సురేశ్ మధ్య పోటీ
-మనీష్‌పై అధిష్ఠానం గుర్రు.. థరూర్‌కు భార్య మృతి అడ్డంకి

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానుండగా, లోక్‌సభలో తమ పక్ష నేత పేరును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఇప్పటికీ లోక్‌సభలో తమ పార్టీ నేత పేరు ఎంపిక చేయలేదన్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు స్పంది స్తూ.. పలు పార్టీలు ఇంకా తమ పక్ష నేతల పేర్లను ఖరారు చేయలేదన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భం గా ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటీకి లోక్‌సభ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి (బెంగాల్), కే సురేశ్ (కేరళ) హాజరయ్యారు.

వీరితోపాటు కేంద్ర మాజీ మం త్రులు మనీశ్ తివారీ, శశి థరూర్ లోక్‌సభ నేత పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లిష్‌పై తిరుగులేని పట్టు గల శశిథరూర్ హిందీలోనూ మాట్లాడగలరు కానీ.. ఆయన భార్య సునంద పు ష్కర్ మృతి కేసు ప్రధాన అడ్డంక య్యే అవకాశాలు న్నాయి. గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. కేరళ నేత సురేశ్, అధిర్ రంజన్‌లకు హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు తక్కువ. ఆనంద్ సాహిబ్ ఎంపీ మనీశ్ తివారీకి హిందీ, ఇంగ్లిష్ భాషలపై సమాన పట్టు ఉన్నది. అయితే ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి నిరాకరించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభలో పార్టీ నేత, ఉప నేత, చీఫ్ విప్, ఇద్దరు విప్‌లను నియమించేందుకు కాంగ్రె స్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉన్నది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం చెబుతున్నది. మరోవైపు నియామకాల్లో హస్తం పార్టీ.. ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉన్నది.

914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles