గోవాలో రాజకీయ సెగ


Tue,September 18, 2018 01:46 AM

Congress stakes claim to form govt in Goa

-ప్రభుత్వ ఏర్పాటుకుసిద్ధమంటూ కాంగ్రెస్ ప్రకటన
-సీఎం పారికర్ ఆరోగ్యంగా ఉన్నారు.. నాయకత్వ మార్పులేదు: బీజేపీ

పనాజీ, సెప్టెంబర్ 17: గోవాలో రాజకీయ సెగ రాజుకుంది. క్లోమ గ్రంథి వ్యాధితో బాధపడుతున్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చేరడంతో రాష్ట్ర రాజకీయం రసకందాయకంలో పడింది. అనారోగ్య కారణాలతో సీఎం పారికర్ పదవి నుంచి వైదొలగితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ఇందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని పేర్కొన్నది. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ మృదులాసిన్హాను సోమవారం కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లగా, ఆమె అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్ నేత చంద్రకాంత్ కవ్‌లేకర్ మీడియాతో మాట్లాడుతూ..అధికార సంకీర్ణ కూటమిలో ఉన్న విభేదాలు, సీఎం పారికర్ అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని అసెంబ్లీని రద్దుచేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మరోవైపు సీఎం పారికర్ ఆరోగ్యంగా ఉన్నారని, రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చే డిమాండ్ ఏదీలేదని బీజేపీ కేంద్ర పరిశీలకుడు రాంలాల్ చెప్పారు. గోవాలో ప్రభుత్వం స్థిరంగా ఉందని, మిత్రపక్షాలు బీజేపీతోనే ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles