గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఖర్చు 820 కోట్లు

Sat,November 9, 2019 01:09 AM

-ఎన్నికల ఖర్చును వెల్లడించిన వివిధ పార్టీలు
-లెక్కలు చెప్పని బీజేపీ

న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు రూ.820 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2014 లో ఖర్చు కన్నా రూ.304 కోట్లు ఎక్కువ. గత లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్‌కు గత నెల 31న కాంగ్రెస్ పార్టీ అందజేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలను బీజేపీ ఇంతవరకు అందజేయలేదు. పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఆదాయవ్యయాలను కాంగ్రెస్ పార్టీతోపాటు తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎంలు ఈసీకి అందజేశాయి. కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.856 కోట్లు విరాళాల రూపంలో పార్టీకి అందగా.. పార్టీ ప్రచారంపై రూ.626.36 కోట్లు, అభ్యర్థులపైన రూ.193.9 కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రూ.83.6 కోట్లు, బీఎస్పీ రూ.55.4 కోట్లు, ఎన్సీపీ రూ.72.3 కోట్లు, సీపీఎం రూ.73.4 కోట్లు ఖర్చు చేసినట్టు ఈసీకి నివేదికలు అందించాయి.

134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles