విద్వేష ప్రచారం ఆపండి


Sat,March 23, 2019 02:31 AM

Congress party struggles to build alliance giving Modi an edge

-మోదీకి, బీజేపీకి కాంగ్రెస్ హితవు
న్యూఢిల్లీ, మార్చి 22: బాలాకోట్ మెరుపుదాడులపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. విద్వేషాలను వ్యాప్తి చేసేందుకు వ్యక్తిగత అభిప్రాయాల్ని వినియోగించుకోవద్దని ప్రధాని మోదీకి, బీజేపీకి హితవు పలికింది. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా శుక్రవారం ట్విట్టర్‌లో స్పందిస్తూ .. పుల్వామా ఉగ్ర దాడి మోదీ హయాంలో జరిగిన దారుణమైన జాతీయ భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ ముక్తకంఠంతో నినదించింది. బాలాకోట్‌లో వాయుసేన మెరుపుదాడులు జరుపడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే, ఇందులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాల వ్యాప్తి కోసం వాడకుండా ప్రధాని, బీజేపీ వెంటనే అడ్డుకట్ట వేయాలి. భద్రతా బలగాల అమరత్వాన్ని మరుగునపర్చుతూ తానే మొత్తం ఖ్యాతి పొందాలని ప్రధాని చూస్తున్నారు. ఉద్యోగాల కల్పన, వ్యవసాయ సంక్షోభం, నోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఓవైపు పుల్వామా అమరవీరులకు జాతి సంతాపం తెలుపుతున్న సందర్భంలో ప్రధాని మోదీ జిమ్ కార్బెట్ పార్కులో సినిమా షూటింగ్‌లతో తీరికలేకుండా గడిపారని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో ఆర్డీఎక్స్, ఎంఐ కార్బన్స్, రాకెట్ లాంఛర్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా చోటుచేసుకుంటుందని, వీటినే పుల్వామా దాడిలో ఉగ్రవాదులు వినియోగించారని ఆరోపించారు.

151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles