హార్దిక్ పటేల్ అరెస్ట్


Thu,August 15, 2019 12:54 AM

Congress leader Hardik Patel Arrested

పలాన్‌పూర్: ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురై గుజరాత్‌లోని పలాన్‌పూర్ జైలులో ఉన్న ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కలువడానికి వెళ్లిన పాటిదార్ ఉద్యమనాయకుడు, కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 27 మంది పార్టీ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. సంజీవ్ భట్ 1990లో జరిగిన లాకప్‌డెత్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తు న్నారు. హార్దిక్, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, వారి అనుచరులు పలాన్‌పూర్‌కు వచ్చారని, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముండటంతో అదుపులోకి తీసుకు న్నామని పోలీసులు తెలిపారు.

113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles