రైతుల మోసకారి.. కాంగ్రెస్


Thu,July 12, 2018 01:36 AM

Congress betrayed Punjab farmers used them as vote bank

-గత 70 ఏండ్లుగా ఒకే కుటుంబం ప్రయోజనం కోసం ఆ పార్టీ పనిచేస్తున్నది
-పంజాబ్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ప్రధాని మోదీ విమర్శల దాడి

మాలోత్ (పంజాబ్), జూలై 11: కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వారిని ఒక కుటుంబం ప్రయోజనాల కోసం ఓటుబ్యాంకుగా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రైతులు ఎంతో కష్టపడుతున్నప్పటికీ సౌకర్యవంతమైన జీవితం జీవించలేకపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల కారణంగా కొన్ని దశాబ్దాలుగా రైతులు నిరాశా నిస్పృహలతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీ గత 70 ఏండ్లుగా ఒక కుటుంబం ప్రయోజనాల కోసం పని చేస్తున్నదని చెప్పారు. ఆ కుటుంబాన్ని సుఖంగా ఉంచడం తప్ప ఆ పార్టీకి మరో ఆలోచన లేదని విమర్శించారు. పంజాబ్‌లోని ముక్తసర్ జిల్లా, మాలోత్‌లో జరిగిన రైతుల సభనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. కొన్నేండ్లుగా మీరు మీ పెట్టుబడి వ్యయంపై పది శాతం లాభాన్ని మాత్రమే పొందుతున్నారని తెలుసు. దీని వెనుక ఉద్దేశమేమిటో నాకు తెలుసు. రైతులు ఈ దేశానికి ఆత్మ వంటి వారు, అన్నదాతలు. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ వారిని మోసం చేస్తూ, అబద్ధాలు చెప్పింది. కాంగ్రెస్ రైతులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంది అని ఆరోపించారు. కేంద్రం ఇటీవల వానాకాలం పంటలకు పెంచిన కనీస మద్దతు ధరపై రైతులకు వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో అకాలీదళ్, బీజేపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన రైతులు ఈ సభకు హాజరయ్యారు. గత నాలుగేండ్లుగా మీరు రికార్డుస్థాయి ఉత్పత్తితో ధాన్యాగారాలను నింపుతున్నందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని మోదీ అన్నారు.

338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS