అమ్మా.. మీరే దిక్కు!


Fri,July 12, 2019 02:17 AM

Congress Asked Sonia Gandhi To Be Temporary Chief How She Responded

- తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టండి
- సోనియాకు కాంగ్రెస్ సీనియర్ల వేడుకోలు


న్యూఢిల్లీ: అమ్మా.. మీరే దిక్కు. పార్టీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టండి అని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (72)ని ఆ పార్టీ సీనియర్లు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ బాటలోనే పలు రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. రాహు ల్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, ఆత్మహత్యాయత్నాలు కూడా చేసినా ఆయన స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ అధ్యక్షుడి కోసం కాంగ్రె స్ సీనియర్ నేతలు తీవ్ర చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పలు రాష్ర్టాల్లో పార్టీ భవిష్యత్తుపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సోనియానే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ విధేయులు కోరుతున్నా ఆమె విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలకు ఆరోగ్యం సహకరించడం లేదని తన సన్నిహితులకు ఆమె చెప్పినట్లు తెలుస్తున్నది.

138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles