ఆరో రోజు కూడా నిరసనేTue,March 13, 2018 02:11 AM

-వివిధ డిమాండ్లపై కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
-గందరగోళం మధ్యే లోక్‌సభలో పరారీలో ఆర్థిక నేరగాళ్లు, చిట్‌ఫండ్స్ సవరణ బిల్లులు

Lok-Sabha
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ మలి విడుత సమావేశాల్లో వరుసగా ఆరో రోజు సోమవారం కూడా ఎటువంటి కార్యకలాపాలు జరుగకుండానే ఉభయసభలు మంగళవారానికి వాయి దా పడ్డాయి. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్‌ఎస్, ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇతర అంశాలపై అన్నాడీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ్ ప్రతా ప్ శుక్లా లోక్‌సభలో పరారీలో ఆర్థిక నేరగాళ్ల బిల్లు 2018, చిట్‌ఫండ్స్ (సవరణ) బిల్లు 2018ని ప్రవేశపెట్టారు. మరోవైపు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు జీరో అవర్ నిర్వహణ కోసం సభ్యులకు నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. కానీ గందరగోళం కొనసాగడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

191

More News

VIRAL NEWS