పరీక్షల్లో తప్పులుంటే మా దృష్టికి తేవొచ్చు


Wed,November 15, 2017 12:18 AM

Complaints should be made online within a week UPSC

-వారంలోగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి:యూపీఎస్సీ
న్యూఢిల్లీ: కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి తాము నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల్లో ఏమైనా పొరపాట్లున్నా, తప్పులు దొర్లినా ఆ విషయాన్ని ఇకపై తమ దృష్టికి తేవచ్చునని తొలిసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఒక బహిరంగ ప్రకటనలో తెలిపింది. ఇందుకు అభ్యర్థులకు వారం వ్యవధి ఇస్తామని పేర్కొంది. ఉదాహరణకు ఒక పరీక్ష మార్చి ఒకటో తేదీన నిర్వహిస్తే, అందులో ఏవైనా తప్పులుంటే మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరుగంటల్లోగా.. ఆన్‌లైన్ (email Id examination-upsc@gov.in)లో ఫిర్యాదు చేయాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

114
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS