రాజ్యసభకు ముకుల్ రాయ్ రాజీనామాThu,October 12, 2017 01:49 AM

mukul-roy
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు నేత ముకుల్ రాయ్ బుధవారం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాయ్ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. భారమైన హృదయంతో బయటకు వస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలో వారు కామ్రేడ్‌లే కానీ సేవకులు కాదు. ఒకే వ్యక్తితో నడిచే పార్టీలు ఇలా పనిచేయడం సరికాదు అని రాయ్ అన్నారు. టీఎంసీలో సీఎం మమతా బెనర్జీ తర్వాత రెండోస్థానంలో రాయ్ అధికారం చెలాయించారు. ఆయన బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో.. రాయ్ మాట్లాడుతూ 1998లో పశ్చిమ్‌బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీచేశాయని, బీజేపీ మతపరమైనది కాదని పేర్కొన్నారు.

139

More News

VIRAL NEWS