కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు


Wed,September 12, 2018 12:47 AM

Coimbatore blast suspect arrested after 20 years

-20 ఏండ్ల తర్వాత అరెస్ట్!
చెన్నై: కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్ల నిందితుడిని సీబీ సీఐడీ పోలీసులు 20 ఏండ్ల తర్వాత అరెస్ట్ చేశారు. 1998లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే ఆద్వానీ పర్యటన సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 58మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు ఎన్పీ నూహూ అలియాస్ మంకాపు రషీద్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అప్పటినుంచి రషీద్ పోలీసుల కండ్లుగప్పి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. సోమవారం సీబీ సీఐడీ పోలీసులు పక్కా సమాచారంతో కేరళలోని కోజికోడ్ జిల్లాలో రషీద్‌ను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

159
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS