వాయుసేనకు మరో ఏడు ఆకాశ్ స్క్వాడ్రన్లు


Sat,September 14, 2019 01:08 AM

Cochin Shipyard lowest bidder for Rs 5,400 crore Navy contract

- భారత్ ఎలక్ట్రానిక్స్‌తో రూ. 5400 కోట్ల ఒప్పందం

న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణుల స్క్వాడ్రన్స్ ఏర్పాటుకు శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థతో భారత వాయుసేన(ఐఏఎఫ్) రూ. 5,400 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఒప్పందంలో భాగంగా ఐఏఎఫ్ అమ్ములపొదిలో అదనంగా ఆకాశ్ క్షిపణికి సంబంధించిన ఏడు స్క్వాడ్రన్స్ కొత్తగా చేరనున్నాయి. ఈ సరికొత్త ఆకాశ్-2 స్క్వాడ్రన్స్ రానున్న మూడేండ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని వాయుసేన అధికారులు తెలిపారు. శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలను ఛేదించడంతోపాటు గగనతలాన్ని పరిరక్షించడంలో ఆకాశ్ క్షిపణి స్క్వాడ్రన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మరోవైపు, సాయుధ దళాల కోసం రూ. 2000 కోట్ల విలువైన ఆయుధాలు, మిలిటరీ ప్లాట్‌ఫావ్‌ును కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది.

165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles