నోటుకు ట్వీటు!


Wed,February 20, 2019 01:23 AM

Cobrapost stings 36 Bollywood celebrities in Operation Karaoke

-అభిప్రాయాలను అమ్ముకునేందుకు సిద్ధపడిన బాలీవుడ్ తారలు
-రాజకీయ పార్టీలకు అనుకూలంగా పోస్టింగులు పెట్టేందుకు ఒప్పుకోలు
-రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు డిమాండ్
-కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నటుల నిజస్వరూపాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కొందరు సినీ నటులు డబ్బుల కోసం తెరపై నటించడమే కాకుండా తెరవెనుక ఏ పనైనా చేయడానికి సిద్ధపడుతుంటారన్న అపవాదు ఒకటి ప్రచారంలో ఉన్నది. ఇది నిజమేనన్నట్లుగా కొందరు బాలీవుడ్ తారలు అనైతిక, చట్టవ్యతిరేక పనులు కూడా చేయడానికి సిద్ధపడటం తాజాగా బట్టబయలైంది. కోబ్రాపోస్ట్ మీడియా సంస్థ ఆపరేషన్ కరావోకే పేరిట నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బాలీవుడ్‌కు చెందిన 36 మంది తారలు డబ్బులు తీసుకొని కొన్ని రాజకీయపార్టీలకు అనుకూలంగా తమ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పోస్టింగులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాకుండా ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా కూడా వారు పోస్టింగ్‌లు పెట్టేందుకు సిద్ధపడ్డారు. వీరిలో జాకీష్రాఫ్, శక్తికపూర్, వివేక్ ఓబెరాయ్, సోనూసూద్, అమీషా పటేల్, మహిమా చౌదరి, రాఖీ సావంత్, పూనం పాండే, సన్నీ లియోనీ తదితరులు న్నారు. తాము కోరిన డబ్బు ఇస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా అభిప్రాయా లు వెల్లడించేందుకు వారు అంగీకరించారు. ఒక్కో పోస్టింగ్‌కు రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేశారు.

ఒకరైతే ఏకంగా 8 నెలల కాంట్రాక్టుకు రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. వీరందరూ తాము కోరిన డబ్బును నగదుగా (నల్లధనం) చెల్లించాలని కోరడం మరో విశేషం. బాలీవుడ్‌లో దాదాపు తెరమరుగైన మహిమా చౌదరి ఒక్క పోస్టింగ్‌కు కోటి రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా బీజేపీ ఎంతైనా ఇవ్వగలదు అని చెప్పడం కొసమెరుపు. తొలుత రూ.20 కోట్లు డిమాండ్ చేసిన సోనూసూద్ ఆ తరువాత నెలకు రూ.2.50 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. తన భర్తకు భారత పౌరసత్వం ఇస్తే, తాను బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధమని సన్నీ లియోనీ చెప్పారు. పోయినసారి కూడా ఇలాగే జరిగింది. అప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ నాతో బేరం కుదుర్చుకున్నారు తెలుసా అంటూ రాఖీసావంత్ గొప్పలు పోయింది.

546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles