వర్షిత హత్య కేసు దర్యాప్తు వేగవంతం

Mon,November 11, 2019 01:58 AM

-నిందితుడి ఊహాచిత్రం విడుదల
-నేరస్థుడిని కఠినంగా శిక్షించాలి: ఏపీ ముఖ్యమంత్రి జగన్

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన చిన్నారి వర్షిత (6) అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతంచేశారు. నిందితుడి ఊహాచిత్రం విడుదలచేశారు. వర్షిణి తల్లిదండ్రులకు ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నా యా? అనే కోణంలో కూడా దర్యాప్తుచేస్తున్నా రు. మూడు రోజుల కింద తల్లిదండ్రులతో కలిసి ఓ పెండ్లి వేడుకకు వెళ్లిన చిన్నారి వర్షితను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్యచేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. చిన్నారిపై అత్యాచారంచేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతిచెందినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

పోలీసులు విచారణలో భాగంగా కల్యాణ మండపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నా రు. పెండ్లిలో చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అనుసరించినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. స్నేహితుల తో ఆడుకుంటున్న చిన్నారిని గమని స్తూ ఆ వ్యక్తి ఫొటోలు తీసినట్టు తెలుస్తున్నది. సదరు చిన్నారితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎవరో పిలువడంతో వర్షిత మండపంలోకి పరుగులు తీసింది. ఆ తర్వాతే చిన్నారి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడు కర్ణాటకవాసిగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు నిందితుడి ఊహాచిత్రాన్ని విడుదలచేశారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. హంతకుడిని పట్టుకొని కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.

90
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles