చౌకీదార్లకు అవమానం


Thu,March 21, 2019 02:39 AM

Chowkidar is now synonymous with patriotism and honesty

-నేరుగా నన్ను విమర్శించే దమ్ములేక వాచ్‌మ్యాన్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు
-దేశభక్తికి చౌకీదార్ పర్యాయపదంగా మారింది
-సెక్యూరిటీగార్డులనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ
-కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేశారని ఆరోపణ

న్యూఢిల్లీ: తనను చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) అ ని దూషిస్తూ విపక్ష పార్టీలు దేశంలోని సెక్యూరిటీ గార్డులను అవమానిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశభక్తికి చౌకీదార్ పర్యాయపదంగా మారిం దన్నారు. హోలీ పండుగ సంద ర్భంగా ప్రధా ని బుధవారం దేశంలోని 25 లక్షల మంది సెక్యూరిటీ గార్డులతో ఆడియో బ్రిడ్జ్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మై భీ చౌకీదార్ (నేనూ కాపలాదారునే) ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. కొందరు నన్ను దూషించి చౌకీదార్లను అవమానించడం దురదృష్టకరం అని మోదీ పేర్కొన్నారు. తన ప్రత్యర్థులకు తనను నేరుగా విమర్శించే దమ్ము లేక వాచ్‌మ్యాన్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కష్టపడే వారిపై ద్వేషం వెళ్లగక్కడం రాజవంశీకులకు అనాదిగా ఉన్న అలవాటేనని గాంధీ-నెహ్రూ కు టుంబంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.. రాఫెల్ ఒ ప్పందంలో అవినీతి జరిగిందని.. దేశానికి చౌకీదార్‌గా చెప్పుకుంటున్న మోదీ చోరీకి పాల్పడ్డారని.. చౌకీదార్ చోర్ హై అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు ప్రతి సభలో నూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శను తిప్పి కొట్టడానికి ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాను చౌకీదార్ నరేంద్రమోదీ అని మార్చుకున్నారు.

వ్యవస్థలను అవమానించడమే వారి విధానం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియా, సాయుధ దళాలను అవమానించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ లు ఓటు వేసేముందు విచక్షణతో ఆలోచించాలన్నారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగ సంస్థ లే ప్రధానమన్నారు. ఈ మేరకు ఆయన ఆన్‌లైన్‌లో ఒక వ్యాసం (బ్లాగ్ పోస్ట్) రాశారు. దేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న ప్రతిసారి, రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మోదీ తెలిపారు. పత్రికా స్వే చ్ఛ విషయంలో వారసత్వ పార్టీలు ఎన్నడూ సంతృప్తిగా లేవన్నారు. రాజవంశం (గాంధీ కుటుంబం) ప్రయోజనాల పరిరక్షణకు ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు. రాష్ర్టాలలో గవర్నర్ పాలన విధించే అధికారం కల ఆర్టికల్ 356ను కాంగ్రెస్ వందసార్లు దుర్వినియోగం చేసింది. స్వయంగా ఇందిరాగాంధీ 50 సార్లు ఆ అధికరణాన్ని ఉపయోగించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా వస్తున్నదన్నారు. కోర్టులు రా జ్యాంగానికి బదులుగా ఒక కుటుంబానికి విధేయత కలిగి ఉండటం కోసం మాజీ ప్రధాని ఇందిర నిబద్ధత కలిగిన న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారన్నారు. కాగ్‌ను, ప్రణాళికా సంఘాన్నీ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. వారి హయాంలో సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని తెలిపారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ మంత్రిత్వ శాఖలోనూ సభ్యుడుకాని ఒక వ్యక్తి చించివేశారని రాహుల్‌గాంధీనుద్దేశించి పేర్కొన్నారు.

323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles