చైనా సైన్యంలోకి సముద్రబల్లి


Tue,April 16, 2019 02:09 AM

China develops world first armed amphibious drone boat

-విజయవంతంగా పరీక్షలన్నీ పూర్తిచేసుకున్న మెరైన్ లిజర్డ్
-మొట్టమొదటి ఉభయచర డ్రోన్ బోట్‌గా రికార్డు
బీజింగ్, ఏప్రిల్ 15: అత్యాధునిక ఆయుధాల తయారీలో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు పోటీ ఇస్తున్న చైనా.. తాజాగా మరో ఘనతను సాధించింది. నేలమీద, నీటిపైనా ప్రయాణించగలిగే అత్యాధునిక సాయుధ వాహనాన్ని రూపొందించింది. మెరైన్ లిజార్డ్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ బోట్‌ను విజయవంతంగా పరీక్షించామని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్ సోమవారం తెలిపింది. దీనిని చైనా షిప్‌బిల్డ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (సీఎస్‌ఐసీ) పరిధిలోని ఊచాంగ్ షిప్‌బిల్డింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చేసింది. మెరైనల్ లిజార్డ్‌కు ఈ నెల 8న తుది పరీక్షలను నిర్వహించింది. లెజర్డ్ అన్ని పరీక్షలను విజయవంతంగా అధిగమించిందని, సైన్యానికి అప్పగించేందుకు ఊహాన్ నగరంలోని ఫ్యాక్టరీకి తరలించారని ఓ అధికారి తెలిపారు.

ఈ డ్రోన్ బోట్ పొడవు 12 మీటర్లు. పరిధి 1,200 కిలోమీటర్లు. దీనిని రిమోట్‌తో లేదా ఉపగ్రహాల సాయంతో నియంత్రించవచ్చు. ఇది నీటిపై గంటకు 50 నాట్స్ వేగంతో పరుగులు పెట్టగలదు. ఇందుకోసం డీజిల్ జెట్ ఇంజిన్‌ను, మూడు ప్రొపెల్లర్లను అమర్చారు. ఇది సొంతగా ఈదుతుందని, ఏవైనా అవాంతరాలు ఎదురైతే మార్గాన్ని మార్చుకొని ప్రయాణిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ వాహ నం అడుగున నాలుగు ట్రాక్ యూనిట్లు ఉన్నాయని, వాటి సాయంతో నేలపై 20 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని చెప్పారు. ఇందులో శత్రువులను గుర్తించేందుకు ఒక రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్ అమర్చారు. దాడి చేసేందుకు రెండు మెషీన్ గన్‌లు, శత్రు ఓడలు, యుద్ధవిమానాలపై విరుచుకుపడేందుకు క్షిపణులను నిట్టనిలువుగా ప్రయోగించగలిగేలా లాంచింగ్ వ్యవస్థను అమర్చారు. ఇది ద్వీప ప్రాంతాల్లో జరిగే ఆపరేషన్లకు, తీరప్రాంత రక్షణకు ఉపయోగకరం.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles