చింపాంజీ 56వ పుట్టినరోజు వేడుకలు!

Mon,July 17, 2017 03:05 AM

-ఘనంగా నిర్వహించేందుకు ఢిల్లీ జూ అధికారుల ఏర్పాట్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ జూలో ఉంటున్న రీటా అనే చింపాంజీ 56వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రీటా ఎప్పుడుపుట్టిందనే విషయం కచ్చితంగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ 1964లో ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఢిల్లీ జూకు తరలించారు. రీటా మనుషులు చేసే రకరకాల పనులను చేస్తూ జూకు వచ్చే సందర్శకులను విపరీతంగా ఆకర్షించేది. వయస్సు పైబడిన కారణంగా ప్రస్తుతం అది ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నదని, అయి తే ఐదు దశాబ్దాలకు పైగా ఇక్కడే ఉంటు న్న రీటా జూకే గర్వ కారణమని జూపార్క్ సంయుక్త సంచాలకుడు రాజారామ్ సింగ్ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే విధంగా రీటా పుట్టినరోజు వేడుకలను ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Chimpanzee-Rita

150

More News