పాపం ఫైజల్!


Mon,June 17, 2019 01:50 AM

Child who died in bus buried at Dubai Al Quoz cemetery

-స్కూల్ బస్సులోనే నిద్ర.. ఊపిరాడక మృతిచెందిన చిన్నారి
-దుబాయ్‌లో భారత సంతతికి చెందిన ఆరేండ్ల బాలుడు మృతి

దుబాయ్: స్కూల్ బస్సులో నిద్రపోయిన భారత సంతతికి చెందిన ఆరేండ్ల విద్యార్థి ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన దుబాయ్‌లో జరిగింది. ఆల్‌కోజ్‌లోని ఇస్లామిక్ సెంటర్‌లో చదువుతున్న ముహమ్మద్ ఫర్హాన్ ఫైజల్ శనివారం పాఠశాల వెళ్లడానికి స్కూల్ బస్సు ఎక్కాడు. కొద్ది సేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బస్సు స్కూల్‌కు చేరుకున్నాక, మిగితా విద్యార్థులందరూ దిగిపోగా.. ఫైజల్ మాత్రం బస్సులోనే మిగిలిపోయాడు. విద్యార్థి బస్సులో ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్.. బస్సు డోర్‌ను, కిటికీ అద్దాలను మూసి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకు డ్రైవర్ డోర్ తెరిచిచూడగా.. ఫైజల్ కనిపించాడు. దగ్గరికి వెళ్లి పరీక్షించగా అప్పటికే ఊపిరాడకుండా చనిపోయినట్టు గుర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారాన్ని ఫైజల్ కుంటుంబానికి తెలియజేశారు. కేరళకు చెందిన ఫైజల్ కుటుంబం చాలా కాలంగా దుబాయ్‌లో నివసిస్తున్నది. ఫైజల్ తండ్రి వ్యాపారి. ముగ్గురు సంతానంలో చివరివాడైన ఫైజల్.. గత ఏడాదే ఇస్లామిక్ సెంటర్‌లో చేరాడు. ఫైజల్ మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నది.

203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles