దేశంలోనే సంపన్న సీఎం చంద్రబాబు!Tue,February 13, 2018 01:22 AM

రూ.177 కోట్లతో మొదటిస్థానం.. ఏడీఆర్ నివేదిక వెల్లడి
chandrababu-naidu
కోల్‌కతా: దేశంలో అతి సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. రూ.177కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నిలిచారు. తర్వాత ఐదుస్థానాల్లో వరుసగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ (రూ.129కోట్లు), పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ (రూ.48కోట్లు), తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు (రూ15.5కోట్లు), మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా (రూ.14.5కోట్లు) ఉన్నారు. దేశంలోని 81శాతం మంది ముఖ్యమంత్రులు కోటీశ్వరులని, 35శాతం సీఎంలు క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ తెలిపింది. 31మంది ముఖ్యమంత్రులు ప్రకటించిన అఫిడవిట్లను విశ్లేషించి ఓ నివేదికను సోమవారం ఏడీఆర్ విడుదల చేసింది. దీని ప్రకారం.. 31మందిలో 11మంది (35శాతం) సీఎంలు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటించారని ఏడీఆర్ నివేదిక పేర్కొన్నది.

వీరిలో 26శాతం మంది ముఖ్యమంత్రులు హత్యారోపణల వంటి తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. 25మంది ముఖ్యమంత్రులు (81శాతం మంది) కోటీశ్వరులేనని ఏడీఆర్ వెల్లడించింది. సగటున ఒక్కో సీఎం ఆస్తుల విలువ రూ.16.18కోట్లని తేల్చింది. అతితక్కువ ఆస్తులు కలిగిన సీఎంలుగా మాణిక్ సర్కార్ (త్రిపుర)-రూ. 27లక్షలు, మమతాబెనర్జీ (పశ్చిమబెంగాల్)-రూ.30.45లక్షలు నిలిచారు. ఇక 10శాతంమంది సీఎంలు 12వ తరగతిలోపు విద్యార్హతలు కలిగి ఉండటం గమనార్హం.

2081

More News

VIRAL NEWS