రెండోసారి ఈడీ ఎదుటకు చిదంబరం


Wed,June 13, 2018 12:56 AM

Chidambaram appears before ED for 2nd time in Aircel Maxis case

న్యూఢిల్లీ, జూన్ 12: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం మంగళవారం రెండోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీల్యాండరింగ్ కేసులో ఇప్పటికే ఈ నెల 5న చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ.. మరోసారి తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా చిదంబరం ఉదయం 11 గంటలకే ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. చిదంబరం ఇచ్చే వివరణను విచారణ అధికారులు రికార్డుచేశారు. ఈడీ.. ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ ఒప్పందం, చిదంబరం తీసుకున్న నిర్ణయాలపై విచారించేందుకు కొత్తగా ఓ ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తున్నది. మొదటిసారి ఈడీ ఎదుట హాజరైన చిదంబరాన్ని ఆరుగంటలపాటు ప్రశ్నించి.. ఆయన జవాబులను రికార్డుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు సంస్థ దాఖలుచేసిన చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించిందని పేర్కొంటూ.. ఈడీ చర్యలను అసత్యాలు, ఊహల సమూహంగా చిదంబరం అప్పట్లోనే అభివర్ణించారు.

327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS